Crime News:కుటుంబ బంధాలు వివిధ కారణాలతో బలవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, శారీరక సంబంధాలతో ఇటీవల కుటుంబాలకు కుటుంబాలే తనువులు చాలించిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ తల్లి తన సొంత కూతురికి ఉరిపోసి చంపేసింది. అదే ఉరికి తాను బలైంది.
Crime News:పోలీసులు, స్థానికుల వివరా ల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లోక వేణుగోపాల్‌రెడ్డికి ఐదేండ్ల క్రితం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన సాహితి (26)తో వివాహం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వేణుగోపాల్‌రెడ్డి పెద్దపల్లిలోనే నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కూతురు వితన్యరెడ్డి ఉన్నది.
Crime News:ఎప్పటిలాగే విధులకు వెళ్లి వచ్చిన వేణుగోపాల్‌రెడ్డికి ఇంటిలో భార్య, కూతురు ప్లాస్టిక్ తాడుకు వేలాడుతూ విగతజీవులై కనిపించారు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలను తెలుసుకున్నారు. వారిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సాహితి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే కూతురుకు ఉరేసి, తానూ ఉరిపోసుకున్నదని భావిస్తున్నారు.