Hyderabad: అత్తాపూర్‌లో దారుణం.. యువ‌తిపై ఇంటి ఓన‌ర్ క‌త్తితో దాడి

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌ర పరిధిలోని అత్తాపూర్ హ‌స‌న్‌న‌గ‌ర్‌లో దారుణం చోటుచేసుకున్న‌ది. అద్దెకుంటున్న ఇంటి య‌జ‌మాని క‌త్తి దాడిలో ఓ యువ‌తి తీవ్ర గాయాల‌పాలైంది. ఇంటి అద్దె చెల్లించే విష‌యంలో ఏర్ప‌డిన త‌గాదా ఈఘ‌ట‌కు దారితీసింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

గ‌త కొన్నినెల‌లుగా ఇంటి అద్దె చెల్లించ‌కుండా ఓ కుటుంబం ఉంటున్న‌ది. దీంతో ఆ ఇంటి య‌జ‌మాని అద్దెకు ఉంటున్న వారింటి క‌రెంట్ క‌నెక్ష‌న్ తొలగించాడు. దీంతో ఇరు కుటుంబాల న‌డుమ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది. ఆ ఇంటి య‌జ‌మానిపై అద్దెకు ఉంటున్న కుటుంబం దాడికి పాల్ప‌డగా, కోపోద్రిక్తుడైన ఆ ఇంటి య‌జ‌మాని క‌త్తితో వారిపై దాడికి పాల్ప‌డ్డాడు.

Hyderabad: ఈ దాడిలో అద్దెకు ఉంటున్న యువ‌తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. చేతికి, త‌ల‌కు క‌త్తిపోట్ల గాయాల‌య్యాయి. తీవ్ర‌గాయాల‌పాలైన ఆ యువ‌తిని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత్తాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *