Office Scraps: స్వచ్ఛతా ప్రచారం సందర్భంగా చెత్తను పారవేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ప్రభుత్వమే విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఒక్క నెలలో చెత్తపై 650 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2021 నుంచి కొనసాగుతున్న ప్రత్యేక స్వచ్ఛత ప్రచార కార్యక్రమాల్లో చెత్త విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.2,364 కోట్లు వచ్చినట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ లక్ష్యసాధన వల్ల ప్రభుత్వ కార్యాలయాలు కూడా శుభ్రంగా మారి ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది.
Office Scraps: అక్టోబరు 1 నుంచి 31 వరకు ప్రభుత్వం నాల్గవ ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్‌ను చేపట్టింది. ఈ సందర్భంగా చెత్త అమ్మడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.650 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 5.97 లక్షల ప్రదేశాలలో అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో క్లీనింగ్ పనులు జరిగాయి. చాలా కాలంగా నిరుపయోగంగా పడి ఉన్న చెత్త అమ్ముడుపోయింది. దీంతో 190 చదరపు మీటర్ల ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: CJI Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
Office Scraps: పరిశుభ్రత డ్రైవ్ పరిధి ప్రతి సంవత్సరానికి పెరుగుతోంది. 2023లో 2.59 లక్షల స్థానాల్లో ప్రచారం జరిగింది. 2024లో 5.97 లక్షల సైట్‌లు కవర్ చేశారు. స్పెషన్ క్యాంపెయిన్ 4.0ని గమనించడానికి ఒక నిర్దిష్ట పోర్టల్ రూపొందించారు. రోజువారీ క్లీనింగ్ కార్యకలాపాల వివరాలు ఈ పోర్టల్‌లో పోస్ట్ చేస్తున్నారు.
Commendable!
By focussing on efficient management and proactive action, this effort has attained great results. It shows how collective efforts can lead to sustainable results, promoting both cleanliness and economic prudence. https://t.co/E2ullCiSGX
— Narendra Modi (@narendramodi) November 10, 2024