Tollywood: టాలీవుడ్‌లో పట్టువిడుపుల కారణంగా సినిమా షూటింగ్‌ల బంద్ వరకూ దారితీసింది. ఇటు కార్మికుల తరఫున ఫిలిం ఫెడరేషన్, అటు ఫిలిం చాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ సమస్య వచ్చి కూర్చుంది. కార్మికుల వేతనాలపై నిర్మాతలు సూచించిన పరిష్కారానికి ఫిలిం చాంబర్ ప్రతినిధులు ఒప్పుకోకపోవడంతో సమస్య కొలిక్కిరాలేదు. దీంతో ఈ రోజు (ఆగస్టు 11) నుంచి అన్ని రకాల సినిమా షూటింగ్‌ల బంద్‌కు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
Tollywood: కార్మికులలో విభాగాల వారీగా వేతన పెంపుకు ఫిలిం చాంబర్ ప్రతినిధులు ప్రతిపాదన చేశారు. అది కూడా కేవలం 7 నుంచి 8 శాతం మేరకే పెంచేందుకు ఒప్పుకున్నారు. కానీ, కార్మిక ప్రతిధులు అందరికీ ఒకేలా ఉండేలా 30 శాతం మేరకు వేతన పెంపునకు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చలన్నీ సఫలం కాకపోవడంతో బంద్‌కు పిలుపునిచ్చారు. వేతన పెంపునకు ఒప్పుకున్న నిర్మాతల సినిమాలు కూడా ఆగస్టు 11 నుంచి బంద్ చేయాలని నిర్ణయించారు.