Ayushmann Khurrana

Ayushmann Khurrana: అయుష్మాన్‌ ఖురానాతో ముగ్గురు హీరోయిన్ల రొమాంటిక్ రచ్చ!

Ayushmann Khurrana: అయుష్మాన్ ఖురానా హీరోగా ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పతి పత్నీ ఔర్ వో 2 సినిమా కాస్టింగ్ ఫైనల్ అయింది. ఈ సినిమాలో సారా అలీ ఖాన్, వామిఖా గబ్బీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కామెడీ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో అయుష్మాన్ రొమాన్స్ చేయనున్నారు. సిచువేషనల్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనుంది. 2026 రెండో భాగంలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఊపందుకున్నాయి.

Also Read: Coolie: ‘కూలీ’ టాప్ రికార్డ్.. యూఎస్‌లో సంచలనం!

పతి పత్నీ ఔర్ వో 2.. ఒక అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. 2019లో వచ్చిన మొదటి భాగంలో కార్తిక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్, అనన్య పాండే నటించగా, ఈ సీక్వెల్‌లో కొత్త కథ, కొత్త పాత్రలతో అయుష్మాన్ ఖురానా సందడి చేయనున్నారు. భూషణ్ కుమార్, జూనో చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Top 5 Re-Release: రీ-రిలీజ్ సినిమాల్లో టాప్-5 ఓపెనర్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *