Viral Video: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ‘బొంబాయి’ అనే గ్రామస్థుడు చిరుతపులిని తోక పట్టుకుని ఆపాడు. దీని వలన అతను మహిళలు, పిల్లల ప్రాణాలను కాపాడాడు. గ్రామంలో హీరో అయిపోయాడు. ఇటీవల ఆ గ్రామంలోని పలు జంతువులను చిరుత తినడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు సోమవారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
చిరుతపులిని రక్షించేందుకు అటవీ శాఖ బృందం వచ్చి వల, బోనును ఏర్పాటు చేశారు. అటవీ శాఖ బృందంలో కొందరు గ్రామస్తులు కూడా ఉన్నారు. వారిలో బొంబాయి అనే గ్రామస్థుడు కూడా ఉన్నాడు. ఇతనికి ఆ పేరు కూడా చిత్రంగా వచ్చింది. అతని అసలు పేరు యోగానంద. ఈ యువకుడు ఒకసారి తన గ్రామం నుండి ముంబైకి పారిపోయాడు. దీని తరువాత గ్రామస్తులు దీనిని బొంబాయి అని పిలవడం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Tirupati: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం.. క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
Viral Video: అటవీ అధికారులు బోను, వల అమర్చిన తరువాత చిరుత కదలికలను గుర్తించడానికి అటవీ సిబ్బందితో పాటు బొంబాయి కూడా వెళ్ళాడు. చిరుత పులి పాద ముద్రలను వారు వెతికినప్పటికీ ఎక్కడా పులి కనిపించలేదు. బోను పెట్టిన ప్రదేశానికి గ్రామానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా గ్రామస్థులు ఆసక్తిగా చేరుకున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పక్కనే ఉన్న పొదల్లోంచి బయటకు వచ్చిన చిరుత మహిళలు, చిన్నారుల వైపు పరుగులు తీసింది. అందరూ షాక్ లో ఉన్నారు. అయితే, బొంబాయి వెంటనే తేరుకున్నాడు. భగవంతుని ప్రార్ధిస్తూ ముందుకురికి తన శక్తిని అంతా ఉపయోగించి చిరుత పులి తోకను పట్టుకున్నాడు. మహిళపై అది పడకుండా నిలువరించారు. ఈలోపు రెస్క్యూ టీమ్ కూడా స్పందించింది. వేగం వల వేసి చిరుతను బంధించింది.
ఈ ఘటనపై హీరో బొంబాయి మాట్లాడుతూ చిరుతపులిని పట్టుకునేటప్పుడు నేను భయపడలేదు, కానీ అది ఎంత వేగంగా మనుషులపై దాడి చేస్తుందో తరువాత అటవీ శాఖ బృందం చెప్పినప్పుడు, చాలా ఆందోళన చెందాను అన్నాడు. ఈ ఆపరేషన్‌లో అంతిమంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిరుతపులికి లేదా మనుషులకు కాదు.”
4 ఏళ్ల చిరుతపులికి కంటి సమస్య ఉందని మైసూరులోని రెస్క్యూ సెంటర్‌కు తరలించామని అటవీ శాఖ అధికారిణి అనుపమ హెచ్ తెలిపారు. దాని వయస్సు దాదాపు 4 సంవత్సరాలు. ఆ ప్రాంతంలో ఆహారం కొరత ఉన్నందున చిరుత చాలా బలహీనంగా ఉంది. ఆ చిరుతపులికి కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. ఇప్పుడు దానికి చికిత్స చేయనున్నారు.
Indeed, a filmy capture of a leopard in Karnataka. pic.twitter.com/0tKtRqKlFF
— Ajay Kumar (@ajay_kumar31) January 7, 2025