Bandi Sanjay

Bandi Sanjay: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది

Bandi Sanjay: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇది నన్ను ఎంతగానో కలవరపరిచిందని బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ అన్నారు. ఏకంగా తన ఫోనే అత్యధికంగా ట్యాప్ చేయబడిందని, ఇది తనను షాక్‌కు గురి చేసిందని ఆయన తెలిపారు.

“కేసీఆర్ కుటుంబం అత్యంత క్రూరమైన ఆలోచన చేసింది.”
కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన సంజయ్, వారికి వావి వరసలు లేవని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, సొంత పార్టీ నాయకుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్‌లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన వివరించారు.

“ఈ విషయం గురించి మొదట మాట్లాడింది నేనే.”
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదటగా బయటపెట్టింది తానేనని బండి సంజయ్ తెలిపారు. అధికారులు తనకు చూపించిన వివరాలు చూసి తాను షాక్ అయ్యానని, ఇది ఒక అసాధారణమైన పరిణామమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరగాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ICC Test Rankings: ICC ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్స్ జోరు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *