Theatre Accident

Theatre Accident: కుళ్లిపోయిన థియేటర్ పై కప్పు.. పలువురికి స్వల్ప గాయాలు

Theatre Accident: మహబూబాబాద్‌ జిల్లాలోని ముకుందా థియేటర్‌లో శుక్రవారం రాత్రి దుర్ఘటన చోటుచేసుకుంది. కుబేర సినిమా సెకండ్‌ షో సమయంలో థియేటర్‌ సీలింగ్‌ (పైకప్పు) ఊడి పడి అక్కడున్న ప్రేక్షకులపై పడింది.

ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సినిమా చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా పైకప్పు కూలిపోవడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. దీంతో థియేటర్‌లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ఇది కూడా చదవండి: Mexico Mass Shooting: మెక్సికోలో కాల్పుల కలకలం..12 మంది మృతి

తరువాత గాయపడినవారికి స్థానికులు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, ఈ ఘటనపై ఆగ్రహించిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా థియేటర్‌ను నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyd Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పీఎం, తెలుగు రాష్ట్రాల సీఎం‌లు తీవ్ర దిగ్భ్రాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *