THE LUCK

THE LUCK: “THE LUCK” సామాన్యుడి గేమ్ షో – 10 లక్షల రూపాయలు కారు బహుమానం

THE LUCK: దేశంలోనే సామాన్యుల కోసం తొలి అతిపెద్ద రియాలిటీ షోగా రానున్న “ది లక్” – గెలిచిన వారికి 10 లక్షల రూపాయలు కారు

రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకు ఎంతో మక్కువ కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం చేయనుంది. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల నుండి పలు భాషల్లో రియాలిటీ షోలు ఉండగా అవి అన్ని ఎంతోకొంత సినీ సెలెబ్రిటీలను, అలాగే ఇతర రంగాలలో ప్రముఖులను షోలో బాగంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. కాని దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ గేమ్ లో ఉండేవిధంగా ది లక్ అనే రియాలిటీ షో ఉండబోతుంది అని ఈ షో నిర్వాహక బృందం వారు తెలిపారు.

కాగా నేడు మీడియా సమక్షంలో ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం “ది లక్” పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, యూట్యూబ్ & ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం పై స్ట్రీమ్ కానుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ఆర్ట్స్ బృందం ఈ గేమ్ షోకు సంబంధించిన కొన్ని అంశాలను మీడియాతో పంచుకున్నారు.

“ది లక్” ముఖ్యాంశాలు :

* స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా ఉండే సులభమైన సవాళ్లు.

* ప్రత్యేక ప్రతిభ అవసరం లేదు – కేవలం కృషి, దృష్టి, కొంచెం అదృష్టం.

* ప్రతి విజేతకు రూ. 10 లక్షల బహుమతి.

* విశ్వసనీయ సబ్స్క్రైబర్లలో నుంచి యాదృచ్ఛికంగా ఎంపిక.

* జీరో రిజిస్ట్రేషన్ ఫీజు – పూర్తిగా ఉచితంగా పాల్గొనవచ్చు.

* నూతనత, వినూత్నతతో యువతను ఆకట్టుకునే కంటెంట్‌ను సృష్టించడంలో పేరుపొందిన ప్రజా ఆర్ట్స్ నిర్మించింది.

ఎందుకు “ది లక్”?
ఇది కొత్త తరహా రియాలిటీ వినోదం – పట్టుదల, సహనం, మరియు అవకాశాలను పరీక్షించే వేదిక.
ఇది కీర్తి గురించి కాదు… నిలబడి, నిలిచిపడి, గెలవడానికి దారిని చూపించే వేదిక.

ఈ షోకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బృందం తెలిపారు. అంతేకాక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన ఒక గిఫ్ట్ ఉంటుందని తెలిపారు.

నిర్మాత: ప్రశాంత్

క్రియేటివ్ డైరెక్టర్స్: శ్రేయాస్ సిఎం, సూర్య తోరమ్స్, అపురూప

లీగల్ అడ్వైజర్: సాయి చాతుర్య అరవ

నిర్వాహకులు: మహర్షి నీల & హరిప్రియ మొదలవలస

డి ఓ పి: భాను తేజ

ALSO READ  Thangalaan: ఓటీటీలో వచ్చిన చియాన్ విక్రమ్ 'తంగలాన్'!

లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ బాల

ఈ ఆటలో పాల్గొనాలి అంటే ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి www.theluck.world

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *