Thangalaan: చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మొత్తానికీ ఓటీటీలో వచ్చేసింది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో థియేట్రికల్ గా వంద కోట్ల గ్రాస్ ను అధిగమించింది. నటుడిగా విక్రమ్ కు మంచి విజయాన్ని అందించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో విక్రమ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను ఇచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ స్టీమింగ్ చేస్తోంది. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాను నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో అయినా చూస్తారేమో చూడాలి.
