Thandel: నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సందడి చేస్తుంది. యువ దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. బుక్ మై షో లో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ చూస్తే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్థమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి బుక్ మై షోలో ఏకంగా 75 వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
