Thalapathy Vijay: తమిళనాట మరో స్టార్ పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇళయదళపతి ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి ఇటీవల విల్లుపురంలో భారీ స్థాయిలో ప్రజాసభను పెట్టి తన పార్టీ ఉద్దేశాన్ని వివరించేశాడు. అయితే విజయ్ రాజకీయపార్టీ గురించి కోలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించన్పటికీ ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేశాడు. ఇక తమిళనాటు విజయ్ కి పోటీ ఇచ్చే మరో స్టార్ అజిత్. అలాగే సూర్యకు కూడా సూపర్ స్టార్ డమ్ ఉంది. ఇటీవలో ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకల్లో నటుడు వెంకట్ పరోక్షంగా విజయ్ కాదు సూర్య రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Pushpa 3: ‘పుష్ప3’కి లీడ్ ఇవ్వనున్న మరో స్టార్!?
Thalapathy Vijay: అభిమానులను మభ్య పెట్టడం కాదు… వారికి సరైన ఉపాధి, విద్య అందించాలని ఆ విషయంలో తన పౌండేషన్ ద్వారా పర్ ఫక్ట్ గా పని చేస్తున్న సూర్యకే ఆ అర్హత ఉందన్నది అతని అభిప్రాయం. దీనిపై సూర్య కూడా స్పందించలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు డిప్యూటీ సి.ఎం., నటుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ని అభినందించటం పక్కన పట్టి కార్ రేస్ లో పాల్గొంటున్న అజిత్ కు మద్దతునిస్తూ శుభాకాంక్షలు తెలిపుతూ అజిత్ కుమార్ రేసింగ్ కారు తమిళనాడును ప్రపంచ స్థాయికి తీసుకువెళుతుందని ట్వీట్ చేశారు. విజయ్ డి.ఎం.కె ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన కొద్ది గంటలకే ఉదయనిధి అజిత్ కి మద్దతు తెలపటం తమిళనాట హాట్ టాపక్ అయింది. మరి ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.