Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. రివర్స్ గేర్ వేసిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న మార్పుల వల్ల ధరల్లో ఈ ఒడిదొడుకులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొంతవరకు తగ్గిన బంగారం ధరలు, ఈ నెలలో మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. మంగళవారం నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న రేట్లు.. బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరగ్గా, గురువారం కూడా అదే బాటలో పయనించాయి.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు:
మన హైదరాబాద్‌లో గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,930 కి చేరింది. బుధవారంతో పోలిస్తే ఒకే రోజు రూ.490 పెరిగింది. ఇక సాధారణంగా నగలు చేయించుకునే 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,46,600 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో రేట్లు:
తమిళనాడు రాజధాని చెన్నైలో బంగారం ధరలు మరింత మండిపోతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.760 పెరిగి రూ.1,61,670 కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.600 పెరిగి రూ.1,48,100 గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,60,230 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,46,750 వద్ద ఉన్నాయి. బెంగళూరులో హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్లు రూ.1,59,930, అలాగే 22 క్యారెట్లు రూ.1,46,600 వద్ద కొనసాగుతున్నాయి.

రికార్డు స్థాయిలో వెండి ధరలు:
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఒక్క రోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ.5,000 వరకు పెరగడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2.90 లక్షలకు చేరుకుంది. ఇక ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2.85 లక్షలుగా రికార్డు అయ్యింది. వరుసగా పెరుగుతున్న ఈ ధరలు చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *