NH:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధుల విడుదలకు ఆమోదం లభించింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ఉన్న జాతీయ రహదారులతో పాటు ఈ రహదారి కూడా అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల నడుమ మరింత అనుసంధానం పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న హైవేను జాతీయ రహదారిగా విస్తరించనున్నారు.
NH:తెలంగాణలోని సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి వరకు ఈ జాతీయ రహదారిని విస్తరించనున్నారు. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్ం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వరావుపేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమను కలిపేలా రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.
NH:సూర్యాపేట-రాజమండ్రి రహదారి నడుమ 86.5 కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుండగా, 40.42 కిలోమీటర్ల మేర తొలి ప్యాకేజీని రూ.367.97 కోట్లతో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో పనులను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాదిలోనే పనులు పూర్తయితే రెండు రాష్ట్రాల నడుమ నూతన హైవే అందుబాటులోకి రానున్నది.