viswam

Viswam: ఓటీటీలోకి గోపీచంద్ విశ్వం . . ఎప్పటి నుంచి అంటే . .

Viswam: గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయి పరాజయం పాందింది. ఈ సినిమా సక్సెస్ పై అటు గోపీచంద్ తో పాటు ఇటు దర్శకుడు శ్రీను వైట్ల పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 1 నుంచి ఓటీటీలో దర్శనం ఇస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దీనిని స్ట్రీమింగ్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Nani-Sujeeth: చేతులు మారిన నాని, సుజిత్ చిత్రం..?

Viswam: పీపుల్స్ మీడియాతో కలసి వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కొనుగోలుదారులకు భారీ నష్టాలను అందించింది. రొటీన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో గోపీచంద్ ఏజెంట్ గా యాక్షన్ ప్యాక్ డ్ పాత్రలో నటించాడు. ఇందులో కూడా తన ‘వెంకీ’ సినిమాలో లాగే ట్రైన్ ఎపిసోడ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు శ్రీనువైట్ల. అయితే అది కొద్ది మేరకే మెప్పించగలిగింది. ఇప్పుడు ఓటీటీలోనైనా ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందేమో చూద్దాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి.. 300 కుపైగా విమానాలు ఆలస్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *