TG EdCET 2025 Results

TG EdCET 2025 Results: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

TG EdCET 2025 Results: బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ 2025 పరీక్ష ఫలితాలు శనివారం అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డితో పాటు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి తదితర ప్రముఖులు ఫలితాలను ప్రకటించారు.

ఈ సంవత్సరం ఎడ్‌సెట్ పరీక్షకు మొత్తం 38,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 32,106 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 30,944 మంది అర్హత సాధించారు. ఇది 96.38 శాతంగా నమోదైంది. అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం.

Also Read: SBI: ఎస్బీఐలో 48 వేల జీతంతో ఉద్యోగాలు..

మొదటి ర్యాంకు: హైదరాబాద్‌కు చెందిన గణపతిశాస్త్రి 126 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు.
రెండో ర్యాంకు: హైదరాబాద్‌కే చెందిన శరత్‌చంద్ర 121 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు.
మూడో ర్యాంకు: వరంగల్‌కు చెందిన నాగరాజు 121 మార్కులతో మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు.
జూన్ 1వ తేదీన రెండు సెషన్‌లలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. పరీక్ష పూర్తయిన తర్వాత అధికారులు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం నేడు తుది ‘కీ’తో పాటు ఫలితాలను వెల్లడించారు.

TG EdCET 2025 Results: ఫలితాల కోసం అభ్యర్థులు ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్ https://edcet.tgche.ac.in/ ను సందర్శించి చెక్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు త్వరలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తదుపరి ప్రక్రియలో పాల్గొంటారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Student Visa: అమెరికాలో 6 వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *