Hyderabad: పిల్లల ఆశతో టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె భర్త వీర్యకణాలతో సంతానం కలగాలని కోరినా, సదరు సెంటర్‌లో పనిచేసే వైద్యురాలు వేరే వ్యక్తి వీర్యకణాలను ఉపయోగించిందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై అనుమానం కలిగిన దంపతులు డీఎన్‌ఏ పరీక్ష చేయించారు. ఆ నివేదికలో కడుపులో ఉన్న శిశువు డీఎన్‌ఏ తండ్రిదిగా భావిస్తున్న వ్యక్తికి సరిపోలలేదని స్పష్టమైంది. దీనితో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తగిన ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ కేసుపై పెద్ద చర్చను రేకెత్తిస్తోంది. బాధితులకు న్యాయం కల్పించాలని పలువురు కోరుతున్నారు.