ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలి. కేసు విచారణలో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోకూడదు. సీఎం, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదు. విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారన్నది కేవలం అపోహ మాత్రమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ ను ఎంటర్ టైన్ మెంట్ చేయలేమంటూ పిటిషన్ విచారణను ముగించింది. అటు ఈ కేసు విషయాలు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.
