TTA Womens Day Celebretions: ఉత్తేజాన్నిచ్చే డాన్సులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పాటలు.. ఆత్మస్థైర్యాన్నిచ్చే అనుభవాల మాటలు.. ఉల్లాసంగా సాగిన మహిళా దినోత్సవ విశేషాలు ఇవి. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డల్లాస్ లో తెలుగు మహిళలంతా ఒక్కచోట చేరి.. ఒకరికి ఒకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఆటపాటలతో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు.. వాటిని అధిగమించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి.. ఆత్మస్థైర్యంతో ముందుకు ఎలా వెళ్ళాలి అనే విషయాలను అతిథులు వివరించారు. వారి అనుభవాలనుంచి ఉత్తేజితులయ్యేలా అతిథుల మాటలు సాగాయి. మహిళా దినోత్సవ వేడుకల్లో దాదాపు 1500 మందికి పైగా తెలుగు మహిళలు ఒక్కచోట చేరి కార్యక్రమాన్ని ఉత్సాహంగా సాగేలా చేశారు.
ప్రతి అవకాశాన్ని తమ విజయానికి సోపానంగా మార్చుకోవాలని వక్తలు సూచించారు. మహిళాశక్తి అనంతమని.. తమలో ఉన్న శక్తి సామర్ధ్యాల గురించి చాలామందికి తెలియదు అని.. వాటిని తెలుసుకుని.. జీవితంలో ఉన్నతంగా ఎదగడం చేయాలని ఈ సందర్భంగా వక్తలు చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త సంకల్పంతో మహిళలు మరింత ముందుకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని వారన్నారు.
తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆద్యంతం అద్భుతంగ ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తెలియచేశారు. ఇంతమంది మహిళలు ఒకేదగ్గర చేరి ఉత్సవాణ్ని ఉత్సాహంగా జరుపుకోవోడం.. అందరూ ఒకరిని ఒకరు కలుసుకునే వేదికలా ఇది ఉండడం చాలా బావుందని వారు సంతోషాన్ని వెలుబుచ్చారు.
కార్యక్రమంలో ప్రియా రెడ్డి, డాక్టర్ యమునా గుర్రపు, శృతి రెడ్డి, కేదార్ జోస్యుల తమ సందేశాన్ని వినిపించారు. ప్రశాంతి కనుగుల, సింధూష ఉప్పు, శృతి ఆకవరం, శృతి అనిరెడ్డి, నాగమణి మేకా తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ తరపున కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.