Tejeshwar Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన కలిగించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న గద్వాల పోలీసులు ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడైన తిరుమలరావును అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసుల ఇతర నిందితులైన ఏడుగురిని కూడా అరెస్టు చేశారు.
Tejeshwar Murder Case: తేజేశ్వర్ హత్య కేసులో నిందితులైన సుపారీ గ్యాంగ్‌తో ఈ రోజు (జూన్ 25) తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే 8 మంది నిందితుల అరెస్టుతో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఇదే రోజు పోలీసులు నిందితులను రిమాండ్‌కు పంపే అవకాశం ఉన్నది. కోర్టులో వాదనల సందర్భంగా పోలీసులు నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉన్నది. మరింత లోతుగా కేసును విచారించే అవకాశం ఉన్నది.
Tejeshwar Murder Case: ఇదిలా ఉండగా, సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఒళ్లుగగుర్పొడిచే అంశం వెల్లడైంది. నిందితుడు, బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమలరావుకు, ఐశ్వర్యకు వివాహేతర బంధం ఉన్నదని తేలింది. అయితే తిరుమలరావు భార్యకు పిల్లలు కలగకపోవడంతో ఐశ్వర్యతో సెటిల్ కావాలని తిరుమలరావు ప్లాన్ వేశాడని తెలిసింది. ఐశ్వర్యతో కలిసి వేదేశాల్లో సెటిల్ కావాలని ముందస్తు ప్లాన్ చేసుకొని, తిరుమలరావు భార్యను చంపాలని ప్లాన్ చేశారు.
Tejeshwar Murder Case: ఈ విషయాన్ని ముందే తిరుమలరావు భార్య పసిగట్టింది. దీంతో ఐశ్వర్య భర్త అయిన తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశారని తెలిసింది. దీనికోసం తిరుమలరావు రూ.20 లక్షల లోన్ తీసుకోగా, దానిలో రూ.2 లక్షలను హత్యలో పాల్గొన్న గ్యాంగ్‌కు ఇచ్చారని, మిగతా రూ.18 లక్షలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.
Tejeshwar Murder Case: ఈ హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్యకు తిరుమలరావుతో వివాహేతర బంధం ఉన్న విషయం ఐశ్వర్య సోదరుడు నవీన్‌కు గతంలోనే తెలిసింది. ఈ విషయంపై తరచూ సోదరి ఐశ్వర్యను వారించేవాడని, తిట్టేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఇటీవల తన ఇంటిలోనే నవీన్ మెట్లపై నుంచి కాలు జారి పడి తీవ్రగాయాలతో చనిపోయాడని తెలిసింది. అయితే నవీన్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఐశ్వర్య కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Tejeshwar Murder Case: ఐశ్వర్య, తిరుమలరావు వివాహేతర బంధాన్ని కొనసాగించేందుకు అడ్డొచ్చిన ఎవరినైనా లోకం నుంచి లేకుండా చేసేందుకు అయినా వెనుకాడలేదని తెలుస్తున్నది. తొలుత తిరుమలరావు భార్యను లేపేద్దామనుకున్న వారు.. ఆమె తేరుకోవడంతో.. ప్లాన్‌ను తేజేశ్వర్ వైపు మల్లించి హత్య చేశారు. ఈలోగా నవీన్ చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవడంతో.. హత్య చేసి ఉంటారేమోనన్న కోణంలో విచారణ జరుగుతున్నది.

