Teacher Harassment: వాడికి అన్ని తెలివి తేటలు ఉంది ఉంటె …ఈ పాటికి ఏ ఐఏఎస్ , ఐపీఎస్ ఐపోయేవాడు . అంతే తెలివి లేకనే ఇలా …తల తిక్క పనులు చేస్తున్నాడు. పాఠాలు చెప్పురా ..పనికిమాలిన వాడా అంటే…సైకో లా కొడతావ్ ఏంట్రా వరెస్ట్ ఫెలో. పాపం కదా ఆ చిన్న ప్రాణం ని వాళ్ళ ఎంత విల విల లాడిందో . ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని…బుద్ది బడి పంతులా బిహేవ్ చేయు ..లేదనుకో…పళ్ళు రాల్తాయి .
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాష్టీకానికి పాల్పడ్డాడు. విద్యార్థిపై సదరు ఉపాధ్యాయుడు విచక్షణరహితంగా దాడి చేశాడు. దీంతో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన మియాపూర్‌లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థి ముఖంతోపాటు శరీరంపై తగిలిన గాయాలు కమిలిపోయాయి. దీంతో ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అతడి తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. అయితే గతంలో సైతం విద్యార్థులపై సదరు ఉపాధ్యాయుడు ఇదే రీతిలో ఇష్టారాజ్యంగా కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపించాయి.
Also Read: Anantapur: ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతులు
మదీనగూడలోని ప్రభుత్వ పాఠశాలలో దేవీ ప్రసాద్ అనే విద్యార్థి 3వ తరగతి చదువుతోన్నాడు. శనివారం స్కూల్‌కు వచ్చిన విద్యార్థి లెక్కలు చేస్తున్నాడు. ఆ క్రమంలో లెక్క తప్పు చేసినందుకు అతడిపై ఉపాధ్యాయుడు తీవ్రంగా దాడి చేశాడు. ఒక తప్పునకు పది దెబ్బలు అన్నట్లుగా ఉపాధ్యాయుడు విద్యార్థి ముఖం, శరీరంపై విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో సదరు విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దెబ్బలు తాళలేక.. ఆ విద్యార్థి సమీపంలోని తన ఇంటికి వెళ్లాడు. ఈ దాడి విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఆగమేఘాల మీద పాఠశాలకు చేరుకొని.. ఉపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం అతడిపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాడు.
అయితే గతంలో సైతం ఇదే విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడని.. దీంతో అతడి ముక్కుల్లో నుంచి రక్తం కారిందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దేవీ ప్రసాద్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇదే అంశాన్ని నాడు.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశామని కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.