Vande Bharat Express: దేశంలోని వివిధ మార్గాల్లో 136 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో 62 రైళ్లను 2024లోనే ప్రారంభించారు. భారతీయ రైల్వేలు 2024లో 3,210 కి.మీ రైలు మార్గాన్ని విద్యుదీకరించింది. దీనితో పాటు, రైల్వే విద్యుదీకరణ, బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ 97% కి విస్తరించింది. .
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం కొనసాగుతున్న ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద 1337 స్టేషన్లు ఎంపిక చేశారు. వీటిలో 1198 రైల్వే స్టేషన్ల పనులు ప్రారంభమయ్యాయి.
భారతీయ రైల్వే 2030 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ వరకు, సుమారు 487 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు.. రూఫ్‌టాప్ అలాగే గ్రౌండ్ మౌంటెడ్ ఏర్పాటు చేశారు. దాదాపు 103 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Beggar: బిచ్చగత్తె సంచిలో దొరికిన డబ్బు చూసి అవాక్కయిన అధికారులు
2024-25లో భారతీయ రైల్వేలకు మొత్తం మూలధన వ్యయం రూ. 2,65,200 కోట్లు. ఇది బడ్జెట్‌లో కేటాయించిన అత్యధిక మొత్తం. ఇ-టికెటింగ్ రిజర్వేషన్లలో 86%కి చేరుకుంది.
పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, ‘దేశవ్యాప్తంగా గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు 354 స్థానాలను గుర్తించారు. వీటిలో రైల్వేతర భూమిలో 327 – రైల్వే భూమిలో 27 ఉన్నాయి. అక్టోబరు వరకు ఇలాంటి 91 టెర్మినళ్లు పని చేస్తున్నాయి.