Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎమ్మార్వో రాజారావు ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేయగా, ఆ రైతు చాకచక్యంగా దానిని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని ఒక భూమి పట్టా పాస్‌బుక్‌లో పేరు మార్చడం కోసం తహసీల్దార్ రాజారావు రైతును లంచం అడిగాడు. రైతు రూ.7,000 ఇవ్వగా, ఆ డబ్బు సరిపోదని, ఇంకా ఎక్కువ ఇవ్వాలని తహసీల్దార్ అడిగిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. తన జేబులో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు చేస్తున్నాడనే విషయం తెలియక తహసీల్దార్ రాజారావు డబ్బుల కోసం రైతుతో బేరం ఆడటం వీడియోలో కనిపిస్తుంది.
Also Read: Medchal: మేడ్చల్ జిల్లాలో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి
Bhadradri: ఈ వీడియో బయటపడటంతో తహసీల్దార్ రాజారావు లంచావతారం బట్టబయలైంది. విషయం ఉన్నతాధికారులకు చేరగా, వారు దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అవినీతికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
లంచం ఇస్తూ వీడియో రికార్డు చేసిన రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ లంచావతారం
నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని భూ పట్టా పాస్ బుక్కులో పేరు మార్చడం కోసం రైతు దగ్గర లంచం డిమాండ్
తెలివిగా సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని ఎమ్మార్వో రాజారావుకు డబ్బులు ఇస్తూ వీడియో… pic.twitter.com/8J5vh6H7RU
— TNews Telugu (@TNewsTelugu) June 21, 2025