BP Control: బ్లడ్ ప్రెజర్ పెరిగిన కొద్దీ చాలా సమస్యలొస్తాయి. అందులో తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుండి రక్త స్రావం. ఇవే కాకుండా కొన్ని సార్లు ప్రాణాంతక సమస్యలు కూడా వస్తాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం బీపీని కంట్రోల్ చేయడానికి కొన్ని సహజ నివారణలు ఉన్నాయని, ఇవి మెడిసిన్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హైబీపీ కంట్రోల్ చేయాలంటే .. కొన్ని ఫుడ్స డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.. అవి ఏంటో చూద్దాం..
సాధారణంగా పీచ్ ఫ్రూట్ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. కానీ, ఈ ఫ్రూట్‌లోని గొప్ప గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఓ కప్పు పీచు జ్యూస్‌లో చిటికెడు పరిమాణంలో ధనియాలు, యాలకుల పొడులని కలపండి. దీనిని రెగ్యులర్‌గా తాగడం వల్ల బీపి కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Health Tips: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జ్యూస్ తాగాల్సిందే!
BP Control: ఆరెంజ్ జ్యూస్, కొబ్బరి నీరు.. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. రెండొంతుల నారింజ రసంలో ఓ వంతు కొబ్బరి నీరు కలిపి తీసుకోవడం వల్ల చాలా వరకూ బీపి కంట్రోల్ అవుతుంది.
దోసకాయతో రైతా చేసుకుని తినడం వల్ల కూడా బీపి కంట్రోల్ అవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సరిగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు హైబీపి కూడా కంట్రోల్ అవుతుంది.
పుచ్చకాయని చిటికెడు యాలకులు, ధనియాల పొడితో కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. దీని వల్ల మూత్ర విసర్జన సరిగా బీపి కూడా కంట్రోల్ అవుతుంది. బీపిని కంట్రోల్ చేసుకోవాలనుకునేవారు ఈ టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా రిజల్ట ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.