Surveen Chawla: బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ఇటీవల వెంకటేష్, రానాల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయ్యింది. అయితే సినీ పరిశ్రమలో తన కెరీర్ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె బయటపెట్టారు. దాదాపు దశాబ్దం క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాలతో పాటు తెలుగులో ‘రాజు మహారాజు’ సినిమాలో నటించింది. అయితే, ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌లో కూడా గత ఎనిమిదేళ్లుగా సినిమా అవకాశాలు తగ్గడంతో టెలివిజన్, వెబ్ సిరీస్‌ల వైపు మళ్ళింది. తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన సుర్వీన్, సినీ అవకాశాల కోసం వెళ్లినప్పుడు అసభ్యకరమైన ప్రవర్తన, అనుచితమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నానని వెల్లడించింది. “అవకాశం ఇస్తాం, నీవల్ల మాకు ఏం లాభం?” అని సూటిగా అడిగేవారని, ఇలాంటి బాధల కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమంలో బాధితులు మాట్లాడినప్పుడు వారి బాధను అర్థం చేసుకున్నానని, నటిగా స్థిరపడే వరకు ఇలాంటి సవాళ్లు తప్పవని అన్నారు. ‘అగ్లీ’, ‘హేట్ స్టోరీ-2’, ‘సీక్రెట్ గేమ్స్’, ‘రానా నాయుడు’, ‘క్రిమినల్ జస్టీస్’ లాంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న సుర్వీన్, త్వరలో ‘మండాలా మర్డర్స్’లో కనిపించనుంది.
