Apanna Tanna Manna: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షికతో కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌పై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 1990ల నేపథ్యంలో హృదయాలను ఆకట్టుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ టీజర్, ‘నానీడ వెళుతుందా’ లిరికల్ సాంగ్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా విడుదలైన మరో లిరికల్ వీడియో ‘అపనా తనామన’ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. సింధుజ, శ్రీనివాసన్ ఆలపించిన ఈ గీతానికి సురేష్ బనిశెట్టి సాహిత్యం, ఆనంద్ గుర్రాన సంగీతం అందించారు. సుకుమార్ మాట్లాడుతూ, “సువిక్షిత్‌కు సినిమా పట్ల అద్భుతమైన ప్యాషన్ ఉంది. ఈ సాంగ్ చాలా బాగుంది. చిత్రం ఘన విజయం సాధించాలి” అన్నారు.
హీరో సువిక్షిత్ మాట్లాడుతూ, “సుకుమార్ గారి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ కావడం గర్వంగా ఉంది. 90ల నేపథ్యంలో అందరి హృదయాలను ఆకట్టుకునే ఈ కథ ప్రేక్షకులను ఆ దశకంలోకి తీసుకెళ్తుంది. దర్శకుడు కార్తికేయ విస్తృత రీసెర్చ్‌తో చిత్రాన్ని సహజంగా తెరకెక్కించారు. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు” అన్నారు.