Srikakulam Sherlock Holmes: ‘వెన్నెల’ కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. దీనికి రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ”క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు” చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్నిఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ సక్సెస్ రైడ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ మూవీ ట్రైలర్ కు 3 మిలియన్ డిజిటల్ వ్యూస్ లభించాయని, కథే హీరోగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని, సినిమా కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 ఎప్పుడనే ఎగ్జయిట్ మెంట్ ఆడియెన్స్ లో కలుగుతుందని వంశీ నందిపాటి అన్నారు. ఇందులో నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేశానని అనన్య నాగళ్ళ తెలిపింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబుదూర్ వెళ్ళారని, అక్కడ హత్యకు గురయ్యారని, ఆ రోజున శ్రీకాకుళంలో జరిగిన కొన్ని ఊహాజనిత సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు రైటర్ మోహన్ చెప్పారు.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు..
దక్కన్ సర్కార్ మూవీ టీజర్ లాంచ్
Daccan Sarkar Movie: చాణక్య, కియారెడ్డి, మౌనిక హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘దక్కన్ సర్కార్’. కళా శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ ఆవిష్కరణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ఈ సినిమా చేశామని, పోరాటాలకు విరామం ఉండదనేది ‘దక్కన్ సర్కార్’ ద్వారా తెలియచేయబోతున్నామని కళా శ్రీనివాస్ అన్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియోను నిజామాబాద్ లో భారీగా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘ఘర్షణ’ శ్రీనివాస్, నటి హేమ మాట్లాడారు. ఇందులో కళా శ్రీనివాస్ సైతం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.