సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో శృతిహాసన్ అంటే ఓ పిచ్చి క్రేజ్. స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన శృతి..తనకంటూ ఓ సొంత గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్ పవన్ కల్యాణ్ తో వచ్చిన గబ్బర్ సింగ్, సెవెన్త్ సెన్స్, శ్రీమంతుడు లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ అమ్మడు కొంతకాలంగా సినిమాల విషయంలో కొంత గ్యాప్ తీసుకుంటోందట. అయితే శృతిహా సన్ చివరిసారిగా ప్రభాస్ తో కలిసి సలార్ లో కనిపించింది. ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో వస్తున్న కూలీలో ఆమె నటిస్తోంది. .
ఇంకోటి సలార్ పార్ట్ 2. ఇక మిగతా రెండు మూవీస్ లో ఏమైందో ఏమో తెలియదు కానీ అడవి శేష్ హీరోగా వస్తున్న డెకాయిట్ మూవీ నుంచి, ఇండో ఆంగేలో బేస్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న చెన్నై స్టోరీ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. డెకాయిట్ మూవీలో కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. అలాగే మూవీ టీజర్ కూడా వచ్చింది. ఇక చెన్నై స్టోరీలో సమంతను తీసుకోవాలనుకున్నా కుదరలేదు. దీంతో శృతిహాసన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా మూవీ నుంచి తప్పుకోవడంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం చూస్తున్నారు.
అయితే డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదని ఈ బ్యూటీ అంటోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా నుంచి కూడా శృతి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండో-ఆంగ్లో బేస్డ్ ప్రొడక్షన్ లో ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాకి గతంలో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాను సమంత చేయాల్సింది. అయితే ఆమె మాయోసైటిస్ బారిన పడడంతో ‘చెన్నై స్టోరీ’ ప్రాజెక్ట్ ను ఆమె వదులుకుంది. దీంతో ఈ మూవీలో మెయిన్ లీడ్ కోసం శృతి హాసన్ ని కన్ఫర్మ్ చేశారు. ఎందుకనో సడెన్ గా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందన్న వార్త వస్తుంది.