Shiva Rajkumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘భైరతి రణగల్’. ఈ నెల 15 ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ సూర్య పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’తో పోటీ పడింది. ఒకే సమయంలో రిలీజ్ కావడంతో తన సినిమాను కేవలం కన్నడ రంగానికే పరిమితం చేసి లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ చేశాడు శివరాజ్ కుమార్. నర్తన్ దర్శకత్వం వహంచిన ఈ సినిమాకు శివరాజ్ కుమార్ సతీమణి గీత నిర్మాత. 2017లో వచ్చిన ‘ముఫ్తి’కి ఇది ప్రీక్వెల్. మార్కెట్ లో ‘కంగువ’కు ఉన్న బజ్ ని లెక్క చేయకుండా కన్నడలో సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు శివరాజ్ కుమార్. ఈ ఎమోషనల్ డ్రామాలో శివరాజ్ కుమార్ మాస్ క్యారక్టర్ ను దర్శకుడు అద్భుతంగా ప్రజెంట్ చేశాడట. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎస్సెట్ అంటున్నారు. కర్నాటకలో విజయం సాధించటంతో అక్కడ థియేటర్లను పెంచటమే కాదు తెలుగులోనూ విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇటీవల ‘జైలర్’లో అతిథిగా మెరిసిన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రను పోషించనున్నాడు. అలాగే విజయ్ చివరి సినిమాలో ముఖ్య పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నాడు. కన్నడలో విజయం సాధించిన ‘బైరతి రణగల్’ తెలుగులో ఎలాంటి ఆదరణను పొందుతుందో చూద్దాం.
