Sunscreen: వాతావరణం ఎలా ఉన్నా, బయటకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం చాలా అవసరం. ఇది సూర్యుని హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో, ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో చర్మం తేలిగ్గా టాన్ అవుతుంది, పొడిగా మారుతుంది, మంట అనిపిస్తుంది. అందుకే, సరైన సన్‌స్క్రీన్‌ని ఎంపిక చేసుకుని దాన్ని ప్రతి రోజు వాడటం ముఖ్యం.
సన్‌స్క్రీన్ ఎంపికలో పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు:
✔ SPF రేటింగ్ – సన్‌స్క్రీన్ కొనుగోలు చేసేటప్పుడు SPF లెవల్ చూసుకోవాలి. కనీసం SPF 15 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్ రక్షణ కలిగిస్తుంది.
✔ UVA & UVB రక్షణ – సూర్యుని UVA, UVB కిరణాల నుంచి రక్షించే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి.
✔ వాటర్ ప్రూఫ్ సన్‌స్క్రీన్ – ఎక్కువగా చెమట పడే వారు లేదా ఈత కొట్టే వారు వాటర్-ప్రూఫ్ సన్‌స్క్రీన్ వాడడం మంచిది.
✔ చర్మ రకం ఆధారంగా ఎంపిక – పొడి చర్మం ఉన్నవారు లోషన్ రూపంలో ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడాలి.
సాధారణ చర్మం ఉన్నవారు క్రీమ్ వాడొచ్చు.
జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవారు జెల్ ఫార్ములా సన్‌స్క్రీన్ ఉపయోగించాలి.
✔ ప్యాచ్ టెస్ట్ – కొత్తగా ఏదైనా సన్‌స్క్రీన్ ఉపయోగించేముందు చేతిపై పరీక్షించడం మంచిది.
Also Read: Papaya: ఈ వ్యాధి ఉన్నవారికి బొప్పాయి అమృతం
Sunscreen: ప్రతి రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయడం అవసరం, ఎండలోకి వెళ్ళే 20 నిమిషాల ముందు ఉపయోగించాలి.
ఇది మొత్తం నాలుగు గంటల పాటు ప్రభావం చూపుతుంది, అందుకే ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయడం మంచిది. చెమట లేదా నీటి కారణంగా సన్‌స్క్రీన్ తొలగిపోతే తిరిగి రాయాలి.
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సన్‌స్క్రీన్ తప్పనిసరి! ఎండ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించేందుకు, మీ చర్మ రకానికి సరిపోయే ఉత్తమమైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకుని ప్రతిరోజూ అప్లై చేయండి.