AP Seaplane Services

AP Seaplane Services: ఏపీలో ‘సీప్లేన్‌’ టూరిజం సేవలు ..30 నిమిషాల్లోనే శ్రీశైలం చేరొచ్చు

AP Seaplane Services: టూరిజం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏపి టూరిజం సరికొత్త సేవలని అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ సర్వీసులు ప్రారంభం కానున్నాయి .   ఇదివరకే జరిగిన విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. 

‘సీ ప్లేన్’ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి…శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ లో భాగంగా… మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి చేరుకుంది. జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో పాటు  శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్‌ సురక్షితంగా చేరుకుంది. ట్రయల్ రన్ విజయవంతం కావటంతో… అధికారికంగా ప్రారంభించటానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది.

1) ఏపీలోని విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దానిలో భాగంగా నవంబర్ 8న విజయవాడ – శ్రీశైలం మధ్య జరిగిన ట్రయిల్ రన్ కూడా విజయవంతం అయింది. 

2) నవంబర్ 9వ తేదీన విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి “స్కై మీట్స్ సీ” పేరుతో సీ ప్లేన్ డెమో కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

3) దీంతో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య “సీ ప్లేన్‌” సర్వీసులు సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి . నవంబర్ 09 మధ్యాహ్నం 12:40కి విజయవాడ నుంచి సీ ప్లేన్‌ శ్రీశైలంకు ఈ సర్వీస్ బయలుదేరింది, అందులో సీఎం చంద్రబాబు ప్రయాణించారు .  

4) సీ ప్లేన్  విజయవాడ నుంచి బయలుదేరిన శ్రీశైలం చేరుకోవడానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అందులో టేకాఫ్, లాండింగ్ కి మాత్రమే 10 నిమిషాలు తీసుకుంటుంది అని అధికారులు చెబుతున్నారు. 

5) ఈరోజు వెళ్లే సి ప్లేన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మొత్తం 14 మంది ప్రయాణించారు .  

6) విజయవాడ నుంచి శ్రీశైలం వరకు దాదాపు 150 కి.మీ దూరం ఉంటుంది. కానీ సీ ప్లేన్‌లో అతి తక్కువ టైం లోనే శ్రీశైలం చేరుకునే అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లిన సి ప్లేన్ దాదాపు 30 నిమిషాల్లోనే అక్కడికి చేరుకుంది .  

7) ఇక టేకాఫ్, ల్యాండింగ్‌ రెండూ నీటిలోనే ఉండడం సీ ప్లేన్ల మరో ప్రత్యేకత. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

8) ఎయిర్ లో సి ప్లేన్ ప్రయాణించడానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) నుంచి కావలిసిన అనుమతులు ముందుగానే అధికారులు తీసుకున్నారు .  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఇందుకు కావలసిన అనుమతులు వేగవంతంగా లభించాయి .  

ALSO READ  hyderabad: ఇండియన్ ఆర్మీ పేరుతో సైబర్ నేరగాళ్ల టోపి

9) కేంద్ర పౌర విమానయానశాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి దీన్ని నిర్వహించనున్నాయి.  ఏపీలో ఇలాంటి తరహా సి ప్లేన్ వంటి సర్వీస్ లు రావడం మొదటి సరి అని చెప్పుకోవొచ్చు. త్వరలోనే ఏపీ కి వచ్చే టూరిస్టులకు కూడా ఈ సరివెసులు అందుబాటులోకి తీసుకొనిరావడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే సి ప్లేన్ టైమింగ్స్ ఇంకా ధరలు పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ బాధ్యతలను ఏపీ టూరిజం శాఖకు అప్పగించనున్నారని సమాచారం .  

10) గుజరాత్‌లో సీ ప్లేన్ సర్వీసుల్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు  అందుబాటులో ఉండేవి .  అయితే ,  ఆ సర్వీస్ ని ఎక్కువ కాలం నడపలేక పోయారు. మళ్ళీ ఇటీవల  ఈ సి ప్లేన్ సర్వీస్ ని రెండోసారి ప్రారంబించేందుకు అక్కడి టూరిజం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *