Sasivadane

Sasivadane: అక్టోబర్ 10న రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ భారీ ఎత్తున విడుదల

Sasivadane: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు ప్రకటించారు.

‘శశివదనే’ చిత్రాన్ని దసరా సీజన్‌లో అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీకి శ్రీ సాయి కుమార్ దారా అందించిన విజువల్స్, శరవణ వాసుదేవన్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఓ అందమైన ప్రేమ కథా చిత్రానికి విజువల్స్, మ్యూజిక్ ఎంత ప్రాముఖ్యం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శశివదనే’ మూవీని మేకర్స్ ఓ దృశ్యకావ్యంగా మలిచారు. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం మేజర్ అస్సెట్ కానుంది.

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటించారు. ఈ మూవీకి ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా గౌరీ నాయుడు, కొరియోగ్రాఫర్‌గా జేడీ మాస్టర్ పని చేశారు. అక్టోబర్ 10న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

నటీనటులు :

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్, సమర్పణ :గౌరీ నాయుడు, నిర్మాతలు :అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకుడు :సాయి మోహన్ ఉబ్బన, సంగీత దర్శకుడు : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం :అనుదీప్ దేవ్, కెమెరామెన్ :శ్రీ సాయి కుమార్ దారా, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్ :గౌరీ నాయుడు, పీఆర్వో : ఫణి – నాయుడు (బియాండ్ మీడియా), మార్కెటింగ్ : విష్ణు తేజ పుట్టా (క్రాస్ క్లిక్ మార్కెటింగ్)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: బాలయ్య "అన్ స్టాపబుల్" లో అల్లు అర్జున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *