Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: హీరో లేకుండా సినిమా తీస్తా..

Sandeep Reddy Vanga: తన సినిమాలతో టాలీవుడ్-బాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అయన తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అతని సినిమాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం స్త్రీ పాత్రలను తక్కువగా చూపించడం వంటి విమర్శలను ఎదుర్కొంటున్న సందీప్, ఇప్పుడు హీరో లేకుండా సినిమా తీయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ, తన సినిమాలపై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ, “మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేదంటే హీరో లేకుండా తీస్తారా? రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోండి” అనే ప్రశ్నకు స్పందిస్తూ, “హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచన అని తెలిపారు.ఎందుకంటే తాను సినిమాలలో పాటలులేకుండా ఉహించుకోలేను అని అన్నారు.  ఒకవేళ అలాంటి సినిమా తీస్తే, నా చిత్రాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా ‘5 ఏళ్ల క్రితం సందీప్ చెప్పింది, చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు” అని స్పష్టంగా చెప్పారు.

‘యానిమల్’ విమర్శలు

సందీప్ వంగా తన తాజా సినిమా ‘యానిమల్’తో విపరీతమైన విజయం సాధించినప్పటికీ, ఈ చిత్రంలో స్త్రీ పాత్రలను తక్కువగా చూపించారని కొందరు సినీ ప్రముఖులు విమర్శలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలను ఎదుర్కొంటూ, సందీప్ తన సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం గురించి కూడా స్పష్టంగా మాట్లాడారు. అయితే, ఇప్పుడు అతను హీరో లేకుండా సినిమా తీయాలన్న ఆలోచనతో తన సినిమాటిక్ అప్రోచ్‌ను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఇది కూడా చదవండి: Kiran bedi: చిరంజీవి వ్యాఖ్యలపై కిరణ్ బేడీ షాకింగ్ కామెంట్..

‘స్పిరిట్’పై ఆశలు

ప్రస్తుతం సందీప్ వంగా, ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమాపై పనిచేస్తున్నారు. ఈ చిత్రం కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, దీని రికార్డులు ‘బాహుబలి’ని దాటాలని లేదని సందీప్ స్పష్టం చేశారు. “రూ.2000 కోట్లు అనేది చాలా పెద్ద విషయం. ఇది మంచి సినిమా అవుతుంది, కానీ ఎంత వసూళ్లు సాధిస్తుందనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది” అని ఆయన అన్నారు.

సందీప్ వంగా తన సినిమాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మరియు స్త్రీ పాత్రలను తక్కువగా చూపించడం వంటి విమర్శలను ఎదుర్కొంటూ, ఇప్పుడు హీరో లేకుండా సినిమా తీయాలన్న ఆలోచనతో తన సినిమాటిక్ అప్రోచ్‌ను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రయోగం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరి ఆసక్తికి కేంద్రంగా నిలిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *