Worlds Longest Kiss

Worlds Longest Kiss: రెండున్నరరోజులు ముద్దు పెట్టుకుని ప్రపంచరికార్డు సృష్టించిన ప్రేమ జంట.. పదేళ్ల తరువాత విడాకులు!

Worlds Longest Kiss: ముద్దు పెట్టుకోవడం అంటే ఎంత ఒకరి మీద ఒకరికి ప్రేమ కారిపోతున్నా సరే.. ఒక నిమిషం రెండు నిమిషాలు మహా అయితే ఓ పది నిమిషాలు అంతే. అంతకు మించి చాలా కష్టం. ముద్దు అనేది అంత ఈజీ ఏమీ కాదు.. పరస్పరం ప్రేమ.. దానిని వ్యక్తపరుచుకునే పెదవుల కలయిక.. ఓపిక అన్నీ అవసరం. అందులోనూ ఏకంగా ఏభైఎనిమిదిన్నర గంటల పాటు ముద్దు పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు.

ఇది ఎవరైనా ఒప్పుకుంటారు. సరిగ్గా ఇంత సేపు ముద్దుపెట్టుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించింది థాయిలాండ్‌కు చెందిన ఎక్కచై తిరనరత్ – అతని భార్య లక్సానా జంట 2013లో. అప్పట్లో అదొక సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా వారికీ అభినందనలు తెలిపారు. ప్రపంచం నుంచి వచ్చిన స్పందనతో ఆ ముద్దుకోసం తాము పడ్డ కష్టం వారు మర్చిపోయి ప్రపంచ రికార్డ్ సంబరాలు చేసుకున్నారు.

Also Read: Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మెగా డీఎస్సీ.. ఎన్ని పోస్టులంటే..

Worlds Longest Kiss: ఈ రికార్డ్ విజయం మామూలుది కాదు. ఇది వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా అప్పట్లో మీడియా అంతటా వార్తలు.. కథనాలు వచ్చాయి. అయితే, దాదాపు పదేళ్ల తరువాత ఈ ప్రేమ జంట విడిపోతోందని తెలుస్తోంది. ఈ జంట ఇప్పుడు తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త చాలా మంది అభిమానులను బాధపెట్టింది. ఈ జంట విడిపోవడానికి నిర్దిష్ట కారణాలను చెప్పలేదు.

తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోతున్నట్టు చెప్పారు. “ఈ వ్యక్తిగత మార్పును మనం బరువెక్కిన హృదయంతో పంచుకోవాలి” అని ఎక్కచాయ్ ఒక సంక్షిప్త ప్రకటనలో పేర్కొన్నారు. వారి కలిసి గడిపిన సమయం మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందని, కానీ ఇద్దరూ వేర్వేరు దిశల్లో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
మొత్తమ్మీద సుదీర్ఘమైన ముద్దు కూడా ఒక జంటను సుదీర్ఘంగా కలిపి ఉంచలేకపోవడం విషాదమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *