Rohin Reddy: బీఆర్‌ఎస్ పాలన సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ఖైరతాబాద్ డీసీసీ సభ్యుడు రోహిణ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రజల్లో భయభ్రాంతులను కలిగించిందని ఆయన అన్నారు.
“ఒక కాల్ మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం ఒక దుర్మార్గమైన చర్య. దీనికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని రోహిణ్‌రెడ్డి అన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud: మహాన్యూస్‌పై దాడిపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
మరియు, “ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్‌లో ఎవ్వరైనా వేళ్లాడిపోయేలా శిక్ష పడాలి. అప్పుడు తప్ప ఇంకెవ్వరూ ఇటువంటి చర్యలకు పాల్పడేందుకు తెగించలేరు,” అని అన్నారు.
దాడిపై కూడా తీవ్రంగా స్పందన
ఇటీవల మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి వ్యవహారంపై కూడా రోహిణ్‌రెడ్డి స్పందించారు. “మీడియా స్వేచ్ఛను కాపాడాల్సినప్పుడు, ఆఫీసులపై దాడులు చేయడం అసహ్యకరమైన చర్య. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదు” అని ఆయన హితవు పలికారు.