Road Accident: హైదరాబాద్ పరిసర ప్రాంతమైన చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన బలానికి కారు పూర్తిగా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు DSPలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారు చక్రధర్‌రావు, శాంతారావుగా గుర్తించారు. అదే సమయంలో కారు లో ఉన్న అడిషనల్ ఎస్పీ ప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా, కారు డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సమాచారం ప్రకారం గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Begum Bazaar Fake Goods: ఇక్కడ ఫేక్ వస్తువులు దొరుకును.. మీరు కూడా కొనే ఉంటారు..
ఈ ప్రమాదానికి గల నిజమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ తప్పిదమా? లేక కారు వేగం కారణమా? అన్నది దర్యాప్తు తర్వాతే స్పష్టత రానుంది.
ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు డ్రైవర్లను వేగ నియంత్రణ పాటించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని హెచ్చరిస్తున్నారు.