బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీ బాదాడు. 124 బంతుల్లోనే పంత్ సెంచరీని కంప్లీట్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆరు సెంచరీలతో ధోనీ (6)రికార్డును పంత్ సమం చేశాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు రిషభ్ పంత్ – గిల్ ఆచితూచి ఆడారు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ వచ్చారు. క్రీజ్‌లో కుదరుకున్నాక.. ఒక్కసారిగా జోరు పెంచారు. భారత్ ప్రస్తుతం 244/4 పరుగులు చేసి 471 పరుగుల లీడ్‌లో ఉంది. గిల్ (97*) పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో తస్కీన్ అహ్మద్, నహీద్ రానా చెరో వికెట్ తీయగా.. మెహిదీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376, బంగ్లాదేశ్ 149 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
