IPL Auction 2025

IPL Auction 2025: ఐపీఎల్ లో పంత్.. శ్రేయాస్ రికార్డ్.. ఏకంగా అన్ని కోట్లు ఇచ్చిన ఫ్రాంచైజీలు

IPL Auction 2025: పంత్ రూ. 27కోట్లకు లక్నో చెంతకు చేరడం..అత్యధిక ధర పలికిన ఆల్ టైమ్ ప్లేయర్ గా రికార్డు నెలకొల్పడంతో 2025 ఐపీఎల్ మెగావేలం  అధరహో అనిపించింది. భారత స్టార్ ప్లేయర్లకు కోట్లేకోట్లు..ఎన్ని కోట్లైనా పర్లేదు ..కావాసిన ప్లేయర్ల కోసం తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు పోటీ పడడంతో  కోట్లాది రూపాయలు వెల్లువెత్తాయి. తమతమ జట్లను బలంగా మార్చుకోవడానికి కావలసిన ప్లేయర్లకు  కోట్లు కుమ్మరించాయి.  దీంతో జెడ్డాలో జరిగిన మొదటి రోజు వేలం విజయవంతంగా ముగిసింది.

జెడ్డాలో తొలి రోజు జరిగిన  మెగా వేలంలో ఆటగాళ్ల పంట పండింది.  బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఐపీఎల్  ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. అందరూ ఊహించినట్లే స్టార్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌, రిషభ్ పంత్‌ అత్యధిక ధర పలికాడు. రూ.27 కోట్లతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. రిషభ్ పంత్ కంటే కేవలం 25 లక్షలు తక్కువగా  రూ.26.75  కోట్లతో అతనూ  భారీ ధరకు అమ్ముడయ్యాడు.  ఇక అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎవరూ ఊహించనిది వెంకటేశ్ అయ్యర్ ధర.

కెప్టెన్సీ మెటీరియల్ రాహుల్ కంటే అధికంగా..అసలు  ఇంత ధర అతనికి దక్కుతుందన్న అంచనాలు లేని వేళ అతను రూ.23.75 కోట్లు దక్కించుకున్నాడు.  టీ20 ఫార్మాట్ లో అద్భుత ఫాంలో ఉన్న పేసర్ అర్షదీప్ అందరి అంచనాలను నిజం చేస్తూ రూ. 18 కోట్లు పలికాడు. మరోవైపు జట్టులో చోటు కోల్పోయి ..ఇక పనై పోయిందనుకున్న యుజ్వేంద్ర  చహాల్ ఔరా అనిపించాడు. రూ.18 కోట్లు దక్కించుకుని  జాక్ పాట్ కొట్టాడు. ఇక ఐపీఎల్ లో పరుగుల వరద పారించి ..అద్భుతమైన కెప్టెన్ గా నిలిచిన డేవిడ్ వార్నర్.. దూకుడుగా ఆడుతూ ఒకప్పుడు కోట్లు కొల్లగొట్టిన దేవదత్ పడిక్కల్.. అమ్ముడుపోని జాబితాలో నిలిచారు.

IPL Auction 2025: మూడేళ్ల కిందటితో పోలిస్తే ఆటగాళ్లపై వేలంలో ఖర్చు చేసే మొత్తాన్ని రూ.90 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెరగడంతో .. ఈ సారి జరుగుతున్న వేలంలో ఆటగాళ్లు అధిక మొత్తం దక్కించుకుంటున్నారు.  అందరూ చెప్పినట్లే  ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. మెగా వేలం అన్న పేరుకు తగ్గట్లే తొలి రోజు ప్లేయర్లపై  కాసుల వర్షం కురిసింది. ఆదివారం ప్రారంభమైన ఈ వేలం రికార్డుల దుమ్ము దులిపింది. 

తొలిరోజు వేలంలో  అన్ని ఫ్రాంచైజీలు కలిసి కొన్న ఆటగాళ్లు 72 మంది మాత్రమే ..కాగా, ఇందుకోసం కళ్లు చెదిరేలా రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. పంజాబ్ కింగ్స్ 10 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా.. ముంబై  ఇండియన్స్ టీమ్ నలుగురు క్రికెటర్లను తీసుకుంది.  ఫ్రాంచైజీలు నాలుగు ఆర్టీఎం కార్డులను యూస్ చేసాయి. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలిస్తే.. వేలంలో రూ.15.75 కోట్లు పలికిన ఇంగ్లండ్  బ్యాటర్ జోస్ బట్లర్ విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంకా అడుగే పెట్టని రసిఖ్ సలాం రూ.6 కోట్లకు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగించింది.

 మెగా వేలంలో రిషబ్‌ పంత్‌ అత్యధిక ధరతో ఐపీఎల్ లో కొత్త  చరిత్ర సృష్టించాడు. రిషభ్ పంత్‌ పేరు రావడంతోనే వేలంలో మొదటి నుంచి లక్నో రేటు పెంచుతూ పట్టుదలను ప్రదర్శించింది.  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ పడుతున్నా వెనక్కి తగ్గలేదు. రేటు పెంచే విషయంలో తగ్గేదెలా అన్నట్లుగా కోట్లతోనే పలికింది. మిగిలిన ప్రాంఛైజీలు  రూ.20.75 కోట్ల వద్ద తప్పుకోగా.. లక్నో మాత్రమే నిలిచింది.  మిగతా ఫ్రాంఛైజీలు తప్పుకోవడంతో లఖ్‌నవూ మిగిలింది. ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రైట్‌ టు మ్యాచ్‌ వాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అప్పుడు మళ్లీ రేటు పెంచే అవకాశం వచ్చిన లక్నో ప్రాంచైజీ ఏమాత్రం ఆలోచించలేదు. 

పంత్‌ గరిష్ఠ బిడ్‌ను రూ.27 కోట్లుగా లక్నో వెల్లడించడంతో  అంత ధర చెల్లించేందుకుఢిల్లీ ముందుకు  వచ్చేందుకు ఇష్టపడక పోవడంతో రిషభ్ పంత్ లక్నో జట్టు సొంతమయ్యాడు.  కాగా, తొలుత పంత్ కంటే ముందు వేలంలో శ్రేయాస్ అయ్యర్ పేరు రావడంతో అతని కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆది నుంచి అతనికోసం పట్టు వదలకుండా కోట్లు పెంచిన పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. దీంతో 2023 మినీ వేలంలో 24.75 కోట్లతో ఓవరాల్ గా అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచిన  మిచెల్‌ స్టార్క్‌ రికార్డును శ్రేయస్‌ బద్దలుకొట్టాడు. కానీ కాసేపటికే శ్రేయస్‌ను అధిగమించిన పంత్ అత్యధిక ధర పలికిన ఆటగాడి రికార్డును అందుకున్నాడు.  మరో కెఎల్‌ రాహుల్‌ రూ.14 కోట్లకే ఢిల్లీ దక్కించుకుంది. భలే చౌక బేరం అంటూ మురిసింది.

IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.. అమితంగా ఆశ్చర్యపరిచింది  ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కు దక్కిన ధర. తొలుత అతన్ని జట్టులో అట్టిపెట్టుకోకుండా  వేలంలోకి వదిలేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని కళ్లు చెదిరేలా అనూహ్య ధరకు తిరిగి సొంతం చేసుకుంది.  గత సీజన్ ధర రూ. 8 కోట్లతో పోలిస్తే ఈ సారి మెగా వేలంలో అతనికి జాక్ పాట్ తగిలింది. 23. 75 కోట్లు చెల్లించి మరీ కోల్ కతా జట్టు వెంకటేశ్ అయ్యర్ ను తిరిగి దక్కించుకోవడం విశేషం.  ఇక వేలంలో తొలి పేరు వచ్చిన పేసర్ అర్షదీప్ సింగ్ పై కోట్ల వర్షం కురిసింది.  మోగా వేలంలో అతన్ని రూ. 18 కోట్లు చెల్లించి మరీ  పంబాజ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది.  వేలంలో గరిష్ఠ బిడ్‌ను రూ.18 కోట్లకు సన్‌రైజర్స్‌ పెంచగా.. పంజాబ్‌ ఆ ధరకు అర్ష్‌దీప్‌ను ఆర్టీఎంతో తీసుకుంది.ఇక చాహల్ కూడా జాక్ పాట్ కొట్టాడు. రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. 

ఇక యువ వికెట్ కీపర్  జితేశ్ శర్మను రూ.11 కోట్లకు బెంగళూరు దక్కించుకోగా.. అంచనాలను మించి పేసర్ నటజరాజన్ ను రూ.10.75 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. కెరీర్ చరమాంకంలో ఉన్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ. 9.75 కోట్లు చెల్లించి మరీ చెన్నై జట్టు సొంతం చేసుకోగా.. హేజిల్ వుడ్ 12.50 కోట్లు, ఫిల్ సాల్ట్ 11.50 కోట్లతో బెంగళూరు జట్టుకు అమ్ముడయ్యారు. రూ.11 కోట్లతో స్టాయినిస్ పంజాబ్ కింగ్స్ జట్టుకు దక్కగా.. రూ.12.50 కోట్లు చెల్లించి మరీ కివీస్ పేసర్ బౌల్ట్ ను ముంబై జట్టు మళ్లీ జట్టులోకి చేర్చింది. 10.75 కోట్లతో రబాడ గుజర్ చేరగా.. రూ.12.50 కోట్లకు ఆర్చర్ తిరిగి మళ్లీ  రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు వెళ్లి పోయాడు. ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘన్ క్రికెటర్ నూర్ అహ్మద్ కు రూ. 10 కోట్లను వెచ్చించి చెన్నై ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకుంది.

2018 నుంచి వరుసగా  ఆర్సీబీకి ఆడిన హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌  ను ఆజట్టు వదిలేసింది. మెగావేలం అనంతరం వచ్చే సీజన్‌ నుంచి సిరాజ్  గుజరాత్‌ టైటాన్స్‌ తరపున బరిలో దిగబోతున్నాడు. ఈ టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ కోసం గుజరాత్‌ రూ.12.25 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ముంబై స్టార్ కీపర్  ఇషాన్‌ కిషన్‌రూ. 11.25 కోట్లు, సీనియర్ పేసర్ మహమ్మద్‌ షమి ని రూ. 10 కోట్లు పెట్టి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ఇక తొలి రోజు వేలంలో డేవిడ్‌ వార్నర్, బెయిర్‌స్టో, దేవ్‌దత్‌ పడిక్కల్, పియూష్‌ చావ్లాను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. రెండో రోజు వేలం ముగిసిన అనంతరం మళ్లీ వీరి పేర్లను వేలంలోకి తీసుకువస్తారు.

IPL Auction 2025: అప్పుడు ఏదైనా ప్రాంఛైజీ వీరిని కొనుగోలు చేస్తే వీరికి అవకాశం దక్కుతుంది . లేకుంటే అంతే సంగతులు. ఇక వీరికి ఐపీఎల్ లో ప్లేస్ దక్కనట్టే అనుకోవాలి. వేలంలో కొంతమంది స్టార్‌ ఆటగాళ్లు తక్కువ ధరలకే ఆయా ఫ్రాంఛైజీల సొంతమయ్యారు. దక్షిణాఫ్రికా కెప్టెన్, స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్‌క్రమ్‌ను కేవలం రూ.2 కోట్లకే లక్నో దక్కించుకోగా.. బ్యాటర్  రాహుల్‌ త్రిపాఠి రూ.3.40 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.  అంతేకాదు  రూ.4 కోట్లకే రచిన్‌ రవీంద్రను ఆర్టీఎంతో తిరిగి సొంతం చేసుకుంది. రహ్మనుల్లా గుర్బాజ్‌ కేవలం రూ.2 కోట్లు, డికాక్ రూ.3.60 కోట్లకు డికాక్ కోల్ కతాకు దక్కారు.  రూ.3.40 కోట్లకు మిచెల్ మార్ష్ లక్నోకు దక్కాడు. రూ. 4.20 కోట్లకు మాక్స్ వెల్ ను పంజాబ్ చేజిక్కించుకోగా.. జంపాను రూ.2.4 కోట్లకే  సన్‌రైజర్స్‌ కోనుగోలు చేసింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్

ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 104. 40 కోట్లు

మిగిలిన ఉన్న మొత్తం  రూ.15.60 కోట్లు

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

రుతురాజ్‌ (18), జడేజా (18), పతిరన (13), శివం దూబె (12), ధోని (4)

మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నూర్‌ అహ్మద్‌ (10), అశ్విన్‌ (9.75), కాన్వే (6.25), ఖలీల్‌ అహ్మద్‌ (4.80), రచిన్‌ రవీంద్ర (4), రాహుల్‌ త్రిపాఠి (3.40), విజయ్‌ శంకర్‌ (1.20)

ముంబయి (MI)

ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 93.90 కోట్లు

 వేలంలో మిగిలిన  మొత్తం  26.10 కోట్లు

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

 బుమ్రా18కోట్లు, సూర్యకుమార్‌ 16.35 కోట్లు, హార్దిక్‌ 16.35 కోట్లు, రోహిత్‌ శర్మ16.30 కోట్లు, తిలక్‌వర్మ 8 కోట్లు

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: బౌల్ట్‌ 12.50, నమన్‌ ధీర్‌ 5.25, రాబిన్‌ రూ.65 లక్షలు, కర్ణ్‌ శర్మ రూ.50 లక్షలు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

పెట్టిన ఖర్చు: 89.53 కోట్లు

వేలం కోసం మిగిలిన డబ్బు: 30.65 కోట్లు

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

కోహ్లి 21 కోట్లు, రజత్‌ పాటిదార్11 కోట్లు, యశ్‌ దయాల్‌ 5 కోట్లు

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హేజిల్‌వుడ్‌12.50, ఫిల్‌ సాల్ట్‌ 11.50, జితేశ్‌ 11, లివింగ్‌స్టన్‌8.75, రసిక్‌ సలాం6, సుయాష్‌ 2.60 కోట్లు.

సన్ రైజర్స్ హైదరాబాద్

మెగా వేలంలో ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం  114.85 కోట్లు

మిగిలిన మొత్తం రూ. 5.15 కోట్లు

రిటైన్ చేసుకున్న ప్లేయర్లు:

క్లాసెన్‌ (23), కమిన్స్‌ (18), అభిషేక్‌ (14), హెడ్‌ (14), నితీశ్‌కుమార్‌ (6)

 కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఇషాన్‌ కిషన్‌ (11.25), షమి (10), హర్షల్‌ (8), అభినవ్‌ (3.20), రాహుల్‌ చాహర్‌ (3.20), జంపా (2.40), సిమర్‌జీత్‌ (1.50), అథర్వ (రూ.30 లక్షలు)

 కోల్‌కతా నైట్ రైడర్స్

మెగా వేలంలో ఖర్చు చేసిన మొత్తం  రూ.109. 95 కోట్లు

మిగిలిన మొత్తం రూ.10.05 కోట్లు

రిటైన్ చేసుకున్న  ఆటగాళ్లు:

రింకు (13), వరుణ్‌ (12), నరైన్‌ (12), రసెల్‌ (12), హర్షిత్‌ (4), రమణ్‌దీప్‌ (4)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: వెంకటేశ్‌ అయ్యర్‌ (23.75), నోకియా (6.50), డికాక్‌ (3.60), రఘువంశీ (3), గుర్బాజ్‌ (2), వైభవ్‌ (1.80), మయాంక్‌ మార్కండె (రూ.30 లక్షలు)

రాజస్థాన్‌  రాయల్స్

మెగా వేలంలో పెట్టిన ఖర్చు: 102.65 కోట్లు

మిగిలిన మొత్తం : 17.35 కోట్లు

రిటైన్ చేసుకున్న  ఆటగాళ్లు:

శాంసన్‌ (18), జైస్వాల్‌ (18), పరాగ్‌ (14), ధ్రువ్‌ (14), హెట్‌మయర్‌ (11), సందీప్‌ (4)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఆర్చర్‌ (12.50), హసరంగ (5.25), తీక్షణ (4.40), ఆకాశ్‌ మధ్వాల్‌ (1.20), కుమార్‌ కార్తీకేయ (రూ.30 లక్షలు)

ఢిల్లీ కేపిటల్స్

మెగా వేలంలో పెట్టిన ఖర్చు: 106.20 కోట్లు

మిగిలిన మొత్తం  13.80 కోట్లు

రిటైన్ చేసుకున్న  ఆటగాళ్లు:

అక్షర్‌ (16.50), కుల్‌దీప్‌ (13.25), స్టబ్స్‌ (10), అభిషేక్‌ (4)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

కేఎల్‌ రాహుల్‌ (14), స్టార్క్‌ (11.75), నటరాజన్‌ (10.75), ఫ్రేజర్‌ (9), హ్యారీబ్రూక్‌ (6.25), అశుతోష్‌ (3.80), మోహిత్‌ శర్మ (2.20), సమీర్‌ రిజ్వీ (రూ.95 లక్షలు), కరుణ్‌ నాయర్‌ (రూ.50 లక్షలు)

గుజరాత్‌ టైటాన్స్

మెగా వేలంలో పెట్టిన ఖర్చు: 102.50 కోట్లు

మిగిలిన మొత్తం : 17.50 కోట్లు

రిటైన్ చేసుకున్న  ఆటగాళ్లు:

రషీద్‌ ఖాన్‌ (18), శుభ్‌మన్‌ (16.50), సాయి సుదర్శన్‌ (8.50), తెవాటియా (4), షారుక్‌ ఖాన్‌ (4)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

బట్లర్‌ (15.75), సిరాజ్‌ (12.25), రబాడ (10.75), ప్రసిద్ధ్‌ కృష్ణ (9.50), మహిపాల్‌ లొమ్రోర్‌ (1.70), కుశాగ్ర (రూ.65 లక్షలు), మానవ్, అనుజ్, నిశాంత్‌ (30 లక్షలు)

లక్నో సూపర్ జెయింట్స్ 

మెగా వేలంలో పెట్టిన ఖర్చు: 105.15 కోట్లు

మిగిలిన మొత్తం రూ. 14.85 కోట్లు

రిటైన్ చేసుకున్న ప్లేయర్లు:

పూరన్‌ (21), రవి బిష్ణోయ్‌ (11), మయాంక్‌ యాదవ్‌ (11), మోసిన్‌ (4), బదోని (4)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

పంత్‌ (27), అవేశ్‌ (9.75), మిల్లర్‌ (7.50), సమద్‌ (4.20), మార్ష్‌ (3.40), మార్‌క్రమ్‌ (2), ఆర్యన్‌ (రూ.30 లక్షలు)

పంజాబ్‌ కింగ్స్

మెగా వేలంలో పెట్టిన ఖర్చు: 97.50 కోట్లు

మిగిలిన మొత్తం: 22.50 కోట్లు

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

శశాంక్‌ సింగ్‌ (5.50), ప్రభ్‌సిమ్రన్‌ (4)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు: శ్రేయస్‌ (26.75), చాహల్‌ (18), అర్ష్‌దీప్‌ (18), స్టాయినిస్‌ (11), నేహాల్‌ (4.20), మ్యాక్స్‌వెల్‌ (4.20), వైశాఖ్‌ (1.80), యశ్‌ ఠాకూర్‌ (1.60), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (1.50), విష్ణు వినోద్‌ (రూ.95 లక్షలు).

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *