Ap news: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎండీ కూర్మనాథ్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. వరి కోతకు వచ్చే సమయం కావడంతో ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసేందుకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.తూర్పు హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.