Manipur: మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీ, జిరిబామ్ జిల్లాలో అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు ఈరోజు అంటే నవంబర్ 25 నుండి ఓపెన్ కానున్నాయి. అల్లర్ల నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కక్చింగ్, జిరిబామ్ జిల్లాల్లో విద్యా సంస్థలను నవంబర్ 18 నుంచి మూసివేశారు. అల్లర్లు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చెదుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ నిషేధం కొనసాగుతోంది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్, కేంద్రీయ పాఠశాలల్లో నవంబర్ 25 నుంచి సాధారణ తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి సిద్ధం
Manipur: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక కళాశాలల్లో నవంబర్ 25 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, సీఎం బీరెన్ సింగ్‌తో సహా 17 మంది ఎమ్మెల్యేల ఇళ్లపై జరిగిన దాడికి సంబంధించి మణిపూర్ పోలీసులు నవంబర్ 16న మరో 7 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 41 మంది నిందితులను అరెస్టు చేశారు.
నవంబర్ 11న జిరిబామ్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది కుకీ-జో ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తరువాత, కిడ్నాప్ అయినా ముగ్గురు మహిళలు, మీటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు పిల్లల మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి 7 జిల్లాల్లో హింస కొనసాగుతోంది.