Retro: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించిన ఈ చిత్రం పూర్తి స్థాయి లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి.
ఓవర్సీస్‌లో ‘రెట్రో’ క్రేజ్ మరో స్థాయిలో ఉంది. ముఖ్యంగా యూకేలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. తొలిరోజు కోసం యూకేలో 5800కు పైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న హైప్‌ను తెలియజేస్తోంది. దీంతో డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. సూర్య గత చిత్రాల ట్రాక్ రికార్డ్, కార్తిక్ సుబ్బరాజ్ మార్క్ డైరెక్షన్‌తో ‘రెట్రో’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!