Republic Day: భారతదేశం అంతటా జనవరి 26న 76వ గణతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ఉత్తేజాన్ని అందరూ పంచుకున్నారు. అయితే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Republic Day: ఈ గణతంత్ర దిన వేడుకలను తిలకించేందుకు సుమారు 10 వేల మంది ఆహుతులను ఆహ్వానించారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం, సమానత్వం, అభివృద్ధి, సైనిక పరాక్రమాలకు సంబంధించిన సమ్మేళనం ఈ వేడుకల్లో ప్రతిఫలించింది. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు.
Republic Day: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దేశంలోని సాంస్కృతిక వైభవం, సైనిక పటాలాల ఘనతను ప్రపంచానికి చాటారు. ఈ పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తుండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు.
Republic Day: ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో యాంటీ డ్రోన్ వ్వవస్థలు, ఆర్మీ, హెలికాప్టర్లు, భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ పరేడ్‌లో 31 శకలాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొన్నాయి. అదనంగా దాదాపు 5,000 దేశంలో ప్రతిభ కనబర్చిన కళాకారులు 45 నృత్య రీతులతో ప్రదర్శన ఇచ్చారు.
Republic Day: ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 148 మంది మహిళా కవాతు బృందం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండోనేషియాకు చెందిన 152 సాయుధ దళాల సభ్యులు ప్రత్యేక కవాతులో పాల్గొన్నారు. టీ-90 భీష్మ ట్యాంక్, బ్రహ్మోస్ క్షిపణి వంటి అత్యాధునిక సైనిక హార్డ్వేర్‌లతో పాటు స్వదేశీ తయారీ యుద్ధ ట్యాంకులు, విమానాలను ప్రదర్శించారు.