Supreme Court: రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం మత మార్పిడి చేయడం రాజ్యాంగ ద్రోహమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మహిళ క్రైస్తవ మతంలోకి మారిన కేసులో కోర్టు నవంబర్ 26 న ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు. అయితే షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రం పొందడానికి ఆమె తాను హిందువు అని పేర్కొంది.అయితే, దీనిని ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా దీనిపై విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరైనా ఆ మతంలోని విలువలు, ఆలోచనలు, విశ్వాసాల నుంచి నిజమైన స్ఫూర్తిని పొందినప్పుడే మతంలోకి మారాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sambhal Violence: సంభాల్ హింసాకాండ.. నిరసనకారులను పోలీసుల షాక్
Supreme Court: “రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవడమే మత మార్పిడి ఉద్దేశ్యం. కానీ వ్యక్తికి ఆ మతంపై విశ్వాసం లేకపోతే, దానిని అనుమతించలేము. అటువంటి పరిస్థితిలో, ఇది కేవలం రిజర్వేషన్ విధానం అవుతుంది. ఇది సామాజిక స్వభావానికి హాని కలిగిస్తుంది అని పేర్కొంది సుప్రీం కోర్టు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఎవరూ కూడా హిందువుగా చెప్పుకోలేరని బెంచ్ చెప్పింది, “మా ముందు ఉంచిన సాక్ష్యాల ఆధారంగా, పిటిషనర్ క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆమె క్రమం తప్పకుండా చర్చికి వెళుతుంది. కానీ మరోవైపు ఆమె ఒక హిందువు అని క్లెయిమ్ చేస్తోంది. ఇది సరైనది కాదు. ఆ పిటిషనర్ హిందువుగా అంగీకరించలేము అంటూ కోర్టు చెప్పింది. పిటిషనర్ మహిళ తరపున 8 మంది లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు . అదే సమయంలో న్యాయవాదులు అరవింద్ ఎస్, అక్షయ్ గుప్తా, అబ్బాస్ బి, థరానే ఎస్ తమిళనాడు ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించారు.

