Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమంలో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా, రియాక్టర్ పేలుడుతో పారిశ్రామిక వాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దంతో మంటలు వ్యాపించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్ చేస్తామన్నారు