Ravi Teja: తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రియమైన హీరోల్లో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ప్రస్తుతం ఆయన హీరోగా, శ్రీలీల కథానాయికగా, దర్శకుడు బాను భోగవరపు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ‘మాస్ జాతర’ తర్వాత రవితేజ లైనప్‌లో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది.సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘మాస్ జాతర’తో మాస్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన అనంతరం, రవితేజతో సోషియో-ఫాంటసీ జానర్‌లో మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. దీంతో మాస్ మహారాజ నుంచి మరో వినూత్న ప్రాజెక్ట్‌ను చూసే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇక ‘మాస్ జాతర’ విడుదలను మే 9కి ఖరారు చేసినప్పటికీ, ఇది కొంత ఆలస్యం కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
