Allu Arjun Enquiry: సంధ్య ధియేటర్ కేసు విషయంలో సినీనటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు అల్లు అర్జున్. ఆయనతో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఏసీపీ రమేష్, సీఐ రాజు అల్లు అర్జున్ విచారిస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ల సమక్షంలో విచారణ జరుగుతున్నట్టు చెబుతున్నారు. అలాగే, అల్లు అర్జున్ వాంగ్మూలం పోలీసులు రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ముందు పోలీసులు 20 ప్రశ్నలు ఉంచినట్టు ప్రచారం అవుతోంది. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారంపై ప్రశ్నిస్తున్న పోలీస్ అధికారులు.. రాత్రి 9.30 గంటల నుంచి బయటకి వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..
- సంధ్య థియేటర్‌కు వచ్చేప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
- పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?
- పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా? లేదా?
- తొక్కసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
- మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?
- రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
- అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
- మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
- మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
- ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
- అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?
- వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ను సంఘటన విషయమై గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న పోలీసులు ఇప్పుడు మరో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సంధ్య థియేటర్ లో ఆరోజు జరిగిన సీన్ రిక్రియెట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఒకవేళ సీన్ రీక్రియేషన్ చేస్తే ఈరోజు చేస్తారా? మరోరోజు దానికోసం ఏర్పాటు చేస్తారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించిన విచారం వివరాలను మహా న్యూస్ లైవ్ బ్లాగ్ లో తెలుసుకోవచ్చు: Allu Arjun Live Updates: ఎంక్వైరీ టైమ్.. అల్లు అర్జున్ @ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్