Rashmika Mandanna

Rashmika Mandanna: ట్రోల్స్ పై రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు!

Rashmika Mandanna: సినీ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరున్న రష్మిక మందన్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దయ, ఆప్యాయతను ఈ రోజుల్లో కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, దాన్ని కెమెరాల కోసం చేసిన నాటకంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలింగ్, నెగెటివ్ పీఆర్‌లను ఎదుర్కొన్న ఆమె.. ఈ విషయంలో ఏం చెప్పారు? ఆమె ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఏంటి? ఈ క్రమంలో ఆమె ఏ సందేశాన్ని అభిమానులకు అందించారు?

Also Read: CPI Narayana: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?

రష్మిక మందన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను బయటపెట్టారు. “నేను ఎప్పుడూ నిజాయితీగా, ఎమోషనల్‌గా ఉంటాను. కానీ నా దయ, ఆప్యాయతను కొందరు నా నటనగా చూస్తారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ఆమెను టార్గెట్ చేస్తూ జరిగిన పెయిడ్ ట్రోలింగ్, నెగెటివ్ ప్రచారంపై కూడా స్పందిస్తూ.. ” నా మీద దయ చూపలేకపోతే సైలెంట్ గా ఉండండి, ట్రోల్ చెయ్యాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రపంచంలో జీవితంలో పైకి ఎదిగే రైట్ అందరికీ ఉంది. ఇలాంటి వాటికి నేను భయపడను” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు ఎంట్రీ.. జనసేన లో చేరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *