Kanchana 4

Kanchana 4: కాంచన 4లో రష్మిక.. అదిరిపోయే ట్విస్ట్!

Kanchana 4: రష్మిక ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త ప్రముఖ నటి రష్మిక మందన్న, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోంది. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న పాపులర్ హారర్-కామెడీ సిరీస్ ‘కాంచన 4’ లో రష్మిక ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రకటన రష్మిక అభిమానులలో, అలాగే సినిమా వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది.

‘పుష్ప’ సినిమాలో తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక, ఇప్పుడు హారర్-కామెడీ జోనర్‌లో అడుగుపెట్టడం విశేషం. లారెన్స్ ‘కాంచన’ సిరీస్‌కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హారర్, కామెడీ, సెంటిమెంట్ కలగలిపి ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో లారెన్స్ స్టైలే వేరు. ఇప్పుడు ఈ సిరీస్‌లో రష్మిక చేరడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read: Sid Sriram: కొత్త పాటతో మ్యాజిక్ చేస్తున్న సిద్ శ్రీరామ్!

‘కాంచన 4’ కథాంశం, రష్మిక పాత్ర స్వభావం వంటి వివరాలను చిత్ర యూనిట్ ఇంకా గోప్యంగానే ఉంచింది. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. రష్మిక, లారెన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. రష్మిక కొత్త లుక్, ఆమె పాత్ర ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manipur: మణిపూర్ లో తెరుచుకున్న స్కూల్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *