manipur

Manipur: మణిపూర్ లో తెరుచుకున్న స్కూల్స్..

Manipur: ఇంఫాల్ – జిరిబామ్‌లలో 13 రోజుల పాటు మూసివేసిన స్కూల్స్, కాలేజీలు  శుక్రవారం తిరిగి తెరుచుకున్నాయి. . ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్ జిల్లాల్లో పాఠశాలలను రీ ఓపెన్ చేయాలని విద్యా డైరెక్టరేట్ గురువారం ఆదేశించింది.

అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్ కళాశాలలు,రాష్ట్ర విశ్వవిద్యాలయాలను శుక్రవారం నుండి తెరవాలని ఉన్నత – సాంకేతిక విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిరిబామ్‌లో భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగిన తరువాత నవంబర్ 16 నుండి అన్ని పాఠశాలలు , కళాశాలలు మూసివేయబడ్డాయి.

ఈ ఘర్షణలో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తరువాత, మిలిటెంట్లు సహాయక శిబిరం నుండి మైతేయి కుటుంబానికి చెందిన ఆరుగురిని అపహరించారు. కొన్ని రోజుల తర్వాత, మణిపూర్ –  అస్సాంలోని జిరి, బరాక్ నదులలో కిడ్నాప్ అయిన వారి మృతదేహాలు కనిపించాయి. 

ఇది కూడా చదవండి: Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోటీ

Manipur: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జిరిబామ్‌లోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూను ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సడలించింది. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువులు, మందులు కొనుగోలు చేసుకునే అవకాశం దొరికింది.  ఈ కాలంలో అనుమతి లేకుండా సభ/ధర్నా/ర్యాలీ నిర్వహించకూడదని అధికారులు చెప్పారు. 

హింస చెలరేగిన తర్వాత ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురాచంద్‌పూర్, జిరిబామ్,ఫెర్జాల్ సహా తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ మరియు డేటా సేవలు నిలిపివేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bihar: రెండు వందే భారత్ రైళ్ళపై రాళ్ళ దాడి...

One Reply to “Manipur: మణిపూర్ లో తెరుచుకున్న స్కూల్స్..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *