Coolie: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్‌ను కుదిపేయనుందని ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. భారత్‌లోనే కాదు, విదేశాల్లోనూ ఈ సినిమాపై జోష్ పీక్స్‌లో ఉంది. ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ పోటీ నడుస్తోంది. ఏకంగా రూ.80 కోట్ల స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ ఆఫర్లే చెబుతున్నాయి!
Also Read: OG: పవర్ స్టార్ ఓజీకి నైజాంలో రికార్డ్ బిజినెస్?
Coolie: మేకర్స్ ఇంకా ఓవర్సీస్ రైట్స్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. గ్రాండ్ స్కేల్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తూ, రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. రజినీ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడనుందని అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. ‘కూలీ’ హవా ఇప్పటి నుంచే ఓ రేంజ్‌లో సాగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని టాక్!